నిమ్మగడ్డ తొలగింపు విచారణ రేపటికి వాయిదా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ల వాదనలను సుదీర్ఘంగా విన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన బెంచ్ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బుధవారం(ఏప్రీల్ 29)న హైకోర్టులో మరోసారి నిమ్మగడ్డ తొలగింపుపై వాదనలు కొనసాగనున్నాయి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఏపీ ప్రభుత్వం గతవారం తుది కౌంటర్‌ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి