సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఒక రోజు వేతనం జమ చేస్తాం

సచివాలయ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యల్లో ఉద్యోగులందరం పాల్గొంటున్నామని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నామని చెప్పారు. రవాణా సదుపాయాలు లేనందున ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. (ఏపీ లాక్డౌన్ : ఈ సేవలకు మినహాయింపు)
రవాణా సదుపాయం ఉన్న ఉద్యోగులందరం సచివాలయానికి వచ్చి పని చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలను పరిశీలించాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.
(తెలంగాణలో 30కి చేరిన కరోనా కేసులు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి