లాక్‌డౌన్‌ పాటించాల్సిందే.. లేదంటే: కేంద్రం

Central Cabinet Video Conference Meeting With AP Officials On Corona Lock Down - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర అధికారులతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గొబ్రె గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో నీలం సాహ్నితో పాటు డీజీపీ గౌతం సవాంగ్‌, కరోనా స్పెషల్‌ ఆఫీసర్స్‌ కృష్ణబాబు, ప్రద్యమ్న, వినీత్‌ బ్రిజ్‌ లాల్‌, విశాల్‌ గున్నీ పాల్గొన్నారు.

వారిని అనుమతించేది లేదు : ఏపీ డీజీపీ

ఈ సందర్భంగా ప్రభుత్వ సీఎస్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ జ్వరం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతేగాక హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు అక్కడే స్వీయ నిర్భంధంలో ఉండేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లఘించి ఏపీలోకి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు ఇష్టపడితే అనుమతిస్తామని చెప్పామన్నారు. కాగా లాక్‌డౌన్‌ నిబంధన కచ్చితంగా పాటించకపోతే కరోనా కోరలు చాస్తుందని కేంద్రం హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. (కోవిడ్‌: నిమిషాల్లోనే నిర్ధారణ!)

44 మందిని క్వారంటైన్‌కు తరలింపు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top