తొలి నెల జీతం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు

గ్రామ వలంటీర్ ఆదర్శం
తోటపల్లిగూడూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరు పంచాయతీకి చెందిన వలంటీర్ తలారి దయాకర్ తన ఔదార్యాన్ని చూపారు. తొలి నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల గ్రామ వలంటీర్లకు నెలన్నర జీతాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో దయాకర్ తన తొలి నెల వేతనం రూ.5 వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయాలని కోరుతూ సంబంధిత చెక్కును ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అందించారు. తన మొదటి నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని దయాకర్ చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి