దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి

Jawahar Reddy Said All People Should Be Fight Against Corona - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడుతున్న నర్సులు కోసం 10 వేల సర్జికల్‌, 2500 ఎన్‌-95 మాస్కుల్ని టీఎన్‌ఏఐ ఏపీ ప్రతినిధులు అందించారు. శుక్రవారం ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) ఏపీ బ్రాంచ్‌ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డిని కలిసి మాస్క్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. టీఎన్‌ఎఐ ప్రతినిధుల సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో అందరి భాగస్వామ్యం కావాలని.. దాతృత్వాన్ని పెంపొందించుకోవాలని జవహర్‌రెడ్డి కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top