ఉప్పెనలా బీజేపీలోకి చేరికలు: కిషన్‌రెడ్డి

Kishan Reddy


రానున్న జూలై, ఆగస్టు నెలలలో తెలంగాణ ప్రాంతంలోని గ్రామ స్థాయి నాయకులు ఉప్పెనలా బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజారాబాద్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జమ్మికుంట మండల తాజా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కె. విజయ, ఆమె భర్త మాజీ ఎంపీటీసీ గణపతి తమ అనుచరులతో కలిసి శనివారం బీజేపీ చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

 


మార్పు కావాలని కోరుకుంటున్న వారు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపన పడేవారు జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ  కేంద్రంలో అధికారంలోకి కోరుకుంటున్నారని చెప్పారు. అంకితభావంతో, చిత్తశుద్ధితో తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని తెలిపారు. తెలంగాణ అంశం ఎన్నికల ఎజెండా కావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెడితే పార్లమెంట్‌లో ఉన్న తమ పార్టీ ఎంపీలందరూ మద్దతిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో బీజేపీ లాంటి పార్టీ కూడా ప్రజలకు విశ్వాసం కలిగించకపోతే ఉద్యమం పక్కదారి పట్టే అవకాశం ఉందని.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందన్నారు.

 


గ్రామీణ యువత ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీలో చేరికకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పార్టీకి సంబంధంలేని వారు సైతం మోడీ ప్రధానమంత్రి కావాలంటూ తమ గ్రామాలలో ఫ్లెక్సీలు పెడుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగట్టుగానే రానున్న రోజులలో పార్టీని మరింతగా గ్రామాలలోకి తీసుకెళ్లతామని, తెలంగాణ సాధనంలో అంకితబావంతో పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షడు అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top