‘పుర’ పదవుల్లో మహిళలకే పెద్దపీట

Municipal Department Has Finalized the Reservations - Sakshi

103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవుల్లో 51 మహిళలకే   

మొత్తం మీద ఎస్టీలకు 3, ఎస్సీలకు 14, బీసీలకు 34 కేటాయింపు 

రిజర్వేషన్లు ఖరారు చేసిన పురపాలక శాఖ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవుల్లో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. మొత్తం 103 చైర్‌పర్సన్ల పదవుల్లో 51 మహిళలకే కేటాయించింది. రాష్ట్రంలో 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ల పదవులకు పురపాలక శాఖ ఆదివారం రిజర్వేషన్లను ఖరారు చేసింది. వాటిలో ఎస్టీ జనరల్‌కు రెండు, ఎస్టీ మహిళకు ఒకటి, ఎస్సీ జనరల్‌కు 7, ఎస్సీ మహిళకు 7, బీసీ జనరల్‌కు 17, బీసీ మహిళకు 17, ఓసీ జనరల్‌కు 26, ఓసీ మహిళకు 26 చైర్‌పర్సన్‌ పదవులను రిజర్వ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు. మిగిలిన మున్సిపాలిటీలకు కోర్టు కేసులు, సాంకేతిక కారణాలతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక వాటికి ఎన్నికలను నిర్వహిస్తారు. పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసిన 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపాలిటీలు..
ఎస్టీ – మహిళ: రేపల్లె
ఎస్టీ – జనరల్‌: ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), శ్రీకాళహస్తి
ఎస్సీ – మహిళ: కొవ్వూరు, నర్సీపట్నం, పొన్నూరు
ఎస్సీ – జనరల్‌: నాయుడుపేట, పుత్తూరు, తాడేపల్లి 
బీసీ – మహిళ: ఆదోని, ఆమదాలవలస, భీమవరం, ధర్మవరం, మండపేట, మంగళగిరి, నరసాçపురం, పలమనేరు, పార్వతీపురం, పెడన, పెద్దాపురం, వెంకటగిరి, యలమంచిలి
బీసీ – జనరల్‌: బొబ్బిలి, డోన్, జగ్గయ్యపేట, కల్యాణదుర్గం, కొండపల్లి, మాచర్ల, నగరి, పలాస–కాశీబుగ్గ, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయదుర్గం, వినుకొండ, ఎమ్మిగనూరు
ఓసీ – మహిళ: అమలాపురం, బాపట్ల, గుత్తి, గుంతకల్లు, ఇచ్ఛాపురం, జంగారెడ్డిగూడెం, కదిరి, కందుకూరు, కావలి, మదనపల్లి, నంద్యాల, నూజివీడు, పిఠాపురం, రామచంద్రాపురం, సాలూరు, సామర్లకోట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తుని
ఓసీ– జనరల్‌: ఆళ్లగడ్డ, బద్వేలు, చిలకలూరిపేట, చీరాల, గుడివాడ, గూడూరు (నెల్లూరు జిల్లా), హిందూపురం, కుప్పం, మార్కా పురం, మైదుకూరు, నందికొట్కూరు, నరసరావుపేట, నిడదవోలు, పాలకొల్లు, పిడుగురాళ్ల, పుంగ నూరు, రాజంపేట, రాయచోటి, సూళ్లూరుపేట, తాడిపత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top