వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన సజ్జల

Sajjala Ramakrishna Reddy Pays Tribute To YSR On His 71st Birth Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహానేత వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను దాదాపు ఏడాదిలో పాలనలోనే అమలు చేసిన వైఎస్సార్‌ తనయుడు వైఎస్ జగన్‌ సీఎంగా ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ 71వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. (వైఎస్సార్‌కు కుటుంబ సభ్యుల నివాళి)

ఈ కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన మనిషి. చరిత్రలో మర్చిపోలేని నాయకుడు. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొనే వ్యక్తి. రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకుడు. తన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను రైతాంగానికి స్వర్ణసీమగా మార్చారు’’ అని రాజన్న పాలనను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, జంగా కృష్ణమూర్తి, రత్నాకర్, లేళ్ళ అప్పిరెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, నారుమళ్ల పద్మజ, కనకరావు మాదిగ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.(అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top