మరో మైలురాయి!

Sharmila Padayatra


'నేను రాజన్న కూతుర్ని, జగనన్న వదిలిన బాణాన్ని...' అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మరో మైలురాయిని అధిగమించనుంది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కాకరాపల్లిలో 2,500 కిలోమీటర్ల పాదయాత్రను ఆమె పూర్తి చేయనున్నారు. ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన ఘటన.

 


187 రోజుల పాదయాత్రలో91 నియోజకవర్గాలు, 155 మండలాలు, 35 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్‌లు, 1,551 గ్రామాల మీదుగా ఆమె సాగారు. 2,500 కి.మీ. యాత్ర పూర్తిచేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని కాకరాపల్లిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 24 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో మైలురాళ్లు

* 2012 అక్టోబర్‌ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభం

* అనంతపురం జిల్లా పెదకోట్ల దగ్గర 100 కి.మీ పూర్తి

* మహబూబ్‌నగర్‌ జిల్లా కొంకాల దగ్గర 500 కి.మీ పూర్తి

* నల్గొండ జిల్లా కొండ్రపోలు దగ్గర 1000 కి.మీ పూర్తి

* కృష్ణా జిల్లా పెడన దగ్గర 1500 కి.మీ పూర్తి

* పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడు వద్ద 2000 కి.మీ. పూర్తి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top