కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌కు అనుకుని ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సముద్రతీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి