బండారూ.. ఇదేం పని?

TDP Leader Breaks Lockdown Rules in Visakhapatnam - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యక్రమం  

పెందుర్తి: లాక్‌డౌన్‌ నిబంధనలు అందరూ పాటించాలని సూచిస్తున్నప్పటికీ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవేం పట్టడం లేదు. విపత్తు వేళ కూడా తనదైన శైలిలో వెకిలి రాజకీయాలను కొనసాగించారు.
లాక్‌డౌన్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ గవర జగ్గయ్యపాలెంలో బుధవారం పార్టీ కార్యక్రమం నిర్వహించడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావునిచ్చింది. కనీసం భౌతిక దూరం పాటించకుండా క్యాడర్‌తో ముచ్చట్లాడారు.
లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి పత్తా లేకుండాపోయి సహాయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బండారు.. అకస్మాత్తుగా ఇలా పార్టీ కార్యక్రమం నిర్వహించడంపై ప్రజలు ఆక్షేపిస్తున్నారు. కొందరు టీడీపీ మాజీ కార్యకర్తలకే పార్టీ కండువాలు కప్పి.. టీడీపీలో చేరారన్న బిల్డప్‌లు ఇవ్వడం ఈ కార్యక్రమంలో కొసమెరుపు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top