కాజ్‌ వే దాటుతుండగా ఇద్దరు వ్యక్తుల గల్లంతు

Two people Missing While crossing the causeway In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ఉభయ గోదావరి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు కాజ్‌ వే దాటుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో చోటు చేసుకుంది. కాగా, కొట్టుకుపోయిన ముగ్గురిలో ఒకరిని కాపాడినట్లు స్థానికులు పేర్కొన్నారు. మిగతా ఇద్దరి ఆచూకి కోసం పడవలపై గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా గల్లంతయిన వారు సమీర్‌ భాషా, నానిలుగా గుర్తించినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top