కృష్ణా నదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

Women Jumps Into Krishna River Rescued In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గురువారం విజయవాడలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు... గజ ఈతగాళ్ల సాయంతో ఆమెను ప్రాణాలతో కాపాడారు. వివరాలు.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుమారుడిని అక్కడే వదిలేసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఈతగాళ్ల సాయంతో మహిళను రక్షించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను స్వస్థలానికి తీసుకెళ్లారు.(కోడి కూర గొడవ.. రాళ్లతో కొట్టుకున్న ఇరు వర్గాలు)

చదవండి: ‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top