హోంమంత్రి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్

సాక్షి, గుంటూరు : రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సుచరిత, దయాసాగర్ దంపతుల కుమార్తె రిషిక వివాహం తాడేపల్లిగూడెంకు చెందిన అద్దంకి విజయ్‌కుమార్, లీలా పరంజ్యోతి దంపతుల కుమారుడు దీపక్ కుమార్‌తో తణుకులో బుధవారం ఘనంగా జరిగింది. కాగా, గురువారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో రిషిక-దీపక్‌ల రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన దంపతులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు మంత్రులు కూడా ఈ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రిసెప్షన్‌కు హాజరైన గవర్నర్ విశ్వభూషణ్
రిషిక-దీపక్ రిసెప్షన్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులకు బొకేలు అందజేసి ఆశీర్వదించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి