గ్రహం అనుగ్రహం (17-03-2020)

Daily Horoscope in Telugu (17-03-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.అష్టమి ఉ.8.10 వరకు, తదుపరి నవమి నక్షత్రం మూల సా.4.27 వరకు, తదుపరి పూర్వాషాఢవర్జ్యం ప.2.50 నుంచి 4.27 వరకు, దుర్ముహూర్తం ఉ.8.33 నుంచి 9.21 వరకు, తదుపరి రా.10.55 నుంచి 11.43 వరకు అమృతఘడియలు... ఉ.10.05 నుంచి 11.45 వరకు.

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ సత్తా చాటుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి. బంధువుల నుంచి సహాయం.  వ్యాపారులకు కొత్త ఆశలు.  ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవేత్తలకు అనుకూల సమాచారం.

వృషభం: కొత్త పనులు  చేపడతారు. ఆలయాలు సందర్శనాలు. అత్యంత కీలక సమాచారం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు సత్కారాలు.

మిథునం: వృథా ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు.  కొన్ని బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

సింహం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

కన్య: చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృథా ధనవ్యయం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు గందరగోళం. రాజకీయవేత్తలకు సమస్యలు.

తుల: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శుభవర్తమానాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.

వృశ్చికం: కొత్త బాధ్యతలు చేపడతారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొత్త్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాల సందర్శనం. వ్యాపారులకు మరింతగా లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం. కళాకారులకు అవార్డులు.

మకరం: కార్యజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం. అదనపు ఆదాయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ఖర్చులు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.

మీనం: ముఖ్య పనుల్లో  అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top