గ్రహం అనుగ్రహం(24-03-2020)

Daily Horoscope in Telugu (24-03-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి అమావాస్య ప.1.46 వరకు, తదుపరి చైత్ర శు.పాడ్యమి, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.3.14 వరకు, తదుపరి రేవతి
వర్జ్యం ఉ.6.50 నుంచి 8.36 వరకు, దుర్ముహూర్తం ఉ.8.28 నుంచి 9.18 వరకు, తిరిగి రా.10.55 నుంచి 11.43 వరకుఅమృతఘడియలు... రా.9.55 నుంచి 11.40 వరకు.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువులతో సంప్రదింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: దూరప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు లేదా చికాకులు.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం: కుటుంబ సభ్యులతో సఖ్యత. విద్యార్థులకు అనుకూలత. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కుంభం: కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. పనులు మధ్యలో వాయిదా. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత సామాన్యంగా ఉంటాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top