కాంటినెంటల్ కాఫీ కొత్త రుచులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ దిస్ పేరుతో నాలుగు రకాల త్రీ ఇన్ వన్ ప్రీమిక్స్ కాఫీ రుచులను ప్రవేశపెట్టింది. 22 గ్రాముల ప్యాక్ ధర రూ.20గా కంపెనీ నిర్ణయించింది. అయిదు ప్యాక్‌లు కొంటే ఒకటి ఉచితం. త్వరగా కాఫీ తయారు చేసుకునేలా ప్రీమిక్స్ రకాలకు రూపకల్పన చేశామని కంపెనీ కంజ్యూమర్ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పట్నాయక్ తెలిపారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ కాంటినెంటల్ బ్రాండ్‌లో భారత్‌తోపాటు 90కిపైగా దేశాలకు కాఫీని సరఫరా చేస్తోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి