బిగ్‌ రిలీఫ్‌ : భారీగా తగ్గిన బంగారం

Gold Prices Decline From Record High Range - Sakshi

ముంబై : అయిదు రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం జోష్‌కు మంగళవారం బ్రేక్‌ పడింది. గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో ఒక్కరోజే ఏకంగా రూ. 1200 దిగివచ్చి రూ 42,855 పలికాయి. మరోవైపు గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ. 3000 పెరగడం గమనార్హం.

పైపైకి ఎగిసిన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో వెండి ధరలు సైతం దిగివచ్చాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ. 1495 తగ్గి రూ. 47,910కి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా హాట్‌ మెటల్స్‌ ధరలు దిగివచ్చేందుకు కారణమని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం రానున్న రోజుల్లో బంగారం ధరలను నిర్ధేశిస్తుందని వారు చెబుతున్నారు.

చదవండి : పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top