మళ్లీ రూ 40,000 దాటిన బంగారం

ముంబై : గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు దేశీ మార్కెట్లో తిరిగి రూ 40,000 మార్క్‌ను దాటాయి. ఇతర కరెన్సీలతో డాలర్ మారకం విలువ పెరుగుదల నిలిచిపోవడంతో మదుపుదారులు బంగారంవైపు మొగ్గుచూపడం హాట్‌మెటల్స్‌కు కలిసివచ్చింది. మరోవైపు బ్యాంకుల వడ్డీ రేట్లలో కోత విధించడం పసిడికి డిమాండ్ పెంచింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 305 పెరిగి రూ 40,136 పలికింది.
ఇక కిలో వెండి రూ 863 భారమై రూ 35,965కి చేరింది. మరోవైపు గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఏకంగా రూ 5000 దిగివచ్చినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. పలు జ్యూవెలరీ దుకాణాలు, మాల్స్ మూతపడటంతో పసిడి అమ్మకాలు మందకొడిగా సాగాయని ట్రేడర్లు చెబుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి