భగ్గుమన్న బంగారం

Gold Silver Prices Zoom In Mcx - Sakshi

ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ మెరుపులతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 183 భారమై రూ 40,939కి ఎగబాకింది. ఈ ఏడాది బంగారం ధరలు పదిగ్రాములకు రూ 50,000కు చేరువ కావచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధరా మండిపోతోంది. కిలో వెండి ఏకంగా రూ 222 భారమై రూ 46,345కి చేరింది. 

చదవండి : బాంబు అనుకుని తెరిస్తే బంగారం..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top