హీరో మోటోకార్ప్‌ విక్రయాల్లో మరో మైలురాయి

Hero MotoCorp Production At Haridwar Plant Crosses 2.5 Crore Units - Sakshi

2.5 కోట్లకు చేరిన అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ విక్రయాల్లో మరో మైలురాయిని దాటింది. హరిద్వార్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే వాహన అమ్మకాలు 2.5 కోట్ల మార్కును అధిగమించినట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9,500 యూనిట్లు కాగా, ప్రారంభించిన 11 ఏళ్లలోనే ఈస్థాయి రికార్డును నెలకొల్పడం విశేషమని కంపెనీ వివరించింది. 2008లో ఉత్పత్తిని మొదలుపెట్టి.. తాజాగా సాధించిన ఘనత కేవలం ఈ ఒక్క ప్లాంట్‌కే కాకుండా, మొత్తం కంపెనీ విజయంగా భావిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌), చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ విక్రమ్‌ కస్బేకర్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top