మే 4 నుంచి ఈ కామర్స్‌ విక్రయాలు షురూ

Home Ministry Allowed E Commerce Platforms To Sell Non Essential Items  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మే 17 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించినా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసర సరుకులే కాకుండా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర వస్తువుల విక్రయాలకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా గతంలో నిత్యావసర సరుకుల డెలివరీకే గతంలో అనుమతించిన ప్రభుత్వం ఈసారి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పూర్తిస్ధాయిలో ఈకామర్స్‌ సేవలకు అనుమతించింది.

ఎంపిక చేసిన ప్రాంతాల్లో నియంత్రణలను ప్రభుతత్వం సడలించడంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్లను లాంఛ్‌ చేసేందుకు సన్నద్ధమయ్యాయి. ఒన్‌ప్లస్‌ 8 సిరీస్‌ ఫోన్లను భారత్‌ మార్కెట్‌ల్‌ ఒన్‌ప్లస్‌ ఇప్పటికే లాంఛ్‌ చేయగా ఈ ఫోన్లు ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. యాపిల్‌ సైతం భారత మార్కెట్‌లో తన ఐఫోన్‌ ఎస్‌ఈ ధరను రూ 42,990గా ప్రకటించింది. ఇక షియోమి తన ఎంఐ 10 సిరీస్‌, రెడ్‌మి కే 30 ప్రొ సిరీస్‌లు కూడా తమ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో లాంఛ్‌ చేస్తాయని భావిస్తున్నారు.

చదవండి : మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top