బడ్జెట్‌ ధరలో హువావే స్మార్ట్‌పోన్‌

Huawei Enjoy10e smartphone with 5000 mAh battery launched - Sakshi

హువావే ఎంజాయ్‌ 10ఈ స్మార్ట్‌ఫోన్  చైనా మార్కెట్‌లో

బీజింగ్‌:   చైనాకుచెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంజాయ్‌ 10ఈ పేరుతో బడ్జెట్‌ సెగ్మెంట్‌ లోఈ స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేసింది.  భారీ బ్యాటరీ, డ్యుయల్‌ రియర్‌ కెమరా లాంటి కీలకఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను   రెండువేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్‌ చేసింది. అయితే భారత్‌ సహా ఇతర మార్కెట్లలో ఎపుడు లాంచ్‌ చేసిన స్పష్టత లేదు. 

హువావే ఎంజాయ్‌ 10ఈ ఫీచర్లు  
6.3 ఇంచుల డిస్‌ప్లే
600 x 720 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పీ35 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 10
4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌
512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 
13+2  ఎంపీ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు
 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు  
3జీబీ ర్యామ్‌ /64 జీబీ ధర  సుమారు రూ.10,309 
4జీబీర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ధర  సుమారు  రూ.12,375 
మిడ్‌నైట్‌ బ్లాక్‌,  పెర్ల్‌ వైట్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌ కలర్స్‌లో  మార్చి 5వ తేదీ నుంచి  వినియోగదారులకు లభ్యం కానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top