నష్టాల బాటలో స్టాక్‌మార్కెట్లు

ముంబై : గ్లోబల్ మార్కెట్లు కోలుకున్నా స్టాక్‌మార్కెట్లు బుధవారం ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల బాట పట్టాయి. బ్యాంకింగ్ సహా పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోతుండగా, యస్ బ్యాంక్ లాభాల జోరు కొనసాగిస్తూ 40 శాతం పైగా పెరిగి రూ 87కి ఎగిసింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 30,447 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 22 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి