జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు  జూమ్‌

Jet Airways hits upper circuit on report Hinduja Group may bid for airline - Sakshi

సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్‌ హిందూజా బ్రదర్స్‌ జెట్‌ ఎయర్‌వేస్‌ను కొనుగోలుకు  బిడ్‌ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్‌వేస్ షేర్లు  లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్‌లో  ఇన్వెస్టర్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు  చూపారు. దీంతో బీఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్  అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్‌ ఎ యిర్‌వేస్‌కు బిడ్‌ దాఖలు చేయాలని  యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో  ఈ ఏడిది  ఏప్రిల్‌ 17 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top