సేల్స్‌ డౌన్‌ : రెండు ప్లాంట్లను మూసివేసిన మారుతి

Maruti To Shut Down Gurugram Manesar Manufacturing Plants - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ విక్రయాలు పడిపోవడంతో దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 7, 9 తేదీల్లో ప్రయాణీకుల వాహనాలను రూపొందించే గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లను మూసివేయాలని మారుతి సుజుకి నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తామని కంపెనీ బుధవారం బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం అందించింది. మారుతి సుజుకి నిర్ణయంతో కంపెనీ షేర్లు 2.36 శాతం మేర నష్టపోయాయి. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో మొత్తం వాహన విక్రయాలు 1,68,725 కాగా ఈ ఏడాది ఆగస్ట్‌లో అమ్మకాలు 32.7 శాతం పతనమై 1,11,370 వాహనాలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆగస్ట్‌లోనూ అన్ని కంపెనీల ఆటోమొబైల్‌ విక్రయాలు తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు రెట్టింపయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top