మార్కెట్లోకి మహీంద్రా కొత్త బొలెరొ సిటీ పిక్‌ అప్‌

New Bolero Launch From Mahindra - Sakshi

బెంగళూరు: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం).. ప్రత్యేకించి నగర అవ సరాలకు తగిన విధంగా రూపొందించిన ‘బొలెరొ సిటీ పిక్‌–అప్‌’ వాహనాన్ని గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన పిక్‌–అప్‌ వాహన ధర రూ.6.25 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌– బెంగళూరు)గా నిర్ణయించింది. ఫోర్‌–సిలెండర్‌.. 2,523 సీసీ డిజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన వాహనానికి 1.4 టన్నుల పేలోడ్‌ సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.  నగరాల మధ్య అవసరాలు తీర్చడానికి బొలెరొ మ్యాక్సిట్రక్‌ ప్లస్‌ ఉండగా.. నూతన సిటీ పిక్‌–అప్‌ నగర అవసరాలకు సరిపోతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top