వన్‌ప్లస్ సర్ ప్రైజ్, తక్కువ ధరకే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

సాక్షి, ముంబై: వన్‌ప్లస్ తన లేటెస్ట్ స్టార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8 ప్రోలను ఇటీవల గ్లోబల్ మార్కెట్ల ధరలను ప్రకటించిన కొద్ది రోజుల తరువాత సోమవారం భారత్ లో వీటిలో ధరలను వెల్లడించిది. వన్ ప్లస్ బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్)ను కూడా కంపెనీ తీసుకొచ్చింది. వీటి ధరను రూ. 1999గా వుంచింది.
వన్‌ప్లస్ 8 సిరీస్ ధరలు రూ. 41,999 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ ప్రో ఫోన్‌ల అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ రెండు ఫోన్‌ల అమ్మకానికి ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించకపోయినప్పటికీ, బహుశా కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేసాక మే 3 తరువాతనుంచి అమ్మకాలకు అనుమతి లభించనుంది. ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తాయి. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తాయి. అయితే వన్‌ప్లస్ 8, 6 జీబీ వేరియంట్ ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో మాత్రమే లభిస్తుంది.(అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్)
వన్‌ప్లస్ గ్లోబల్ లాంచ్ సందర్భంగా ప్రకటించని వన్‌ప్లస్ 8 స్పెషల్ వేరియంట్ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)ను కూడా భారతదేశంలో విక్రయించబోతోంది. అంతేకాదు భారతదేశంలో వన్‌ప్లస్ 8 ప్రో ధరలు ప్రపంచ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే తీసుకురావడం విశేషం.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .41,999గా వుంటుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ .44,999
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ .49,999
వన్‌ప్లస్ 8 ప్రో ధరలు
వన్‌ప్లస్ 8 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ .59,999 గా ఉండబోతోంది.
బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్) దరను రూ. 1999గా వుంచింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి