రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌..

Reliance Jio Announces Four Benefits For Customers - Sakshi

ముంబై: దేశంలోని మొబైల్‌ వినియోగదారులను ఆకర్శించడంలో రిలయన్స్‌ జియో సంస్థ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా జియో కస్టమర్లకు 4x బెనిఫిట్స్(రిలయన్స్‌ డిజిటల్‌, ట్రెండ్స్‌, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, అజియో) పేరుతో కొత్త ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవాలంటే రూ. 249 లేదా అంతకు మించి రీచార్జ్‌ చేసుకున్న వారికి నాలుగు డిస్కౌంట్‌ కూపన్లు ఇస్తామని సంస్థ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, ఎజియో కూపన్ల ద్వారా కోనుగోళ్లపై డిస్కౌంట్లు పొందవచ్చని సంస్థ తెలిపింది. అయితే రీచార్జ్‌ చేసుకున్న ప్రతి కస్టమర్‌ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమ అవుతాయని, షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లు డిస్కోంట్లు పొందవచ్చని తెలిపింది.

కాగా ఇది వరకే రీచార్జ్‌ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులని సంస్థ ప్రకటించింది. అయితే అడ్వాన్స్ రీచార్జ్‌ చేసుకున్న వారు మై జియో యాప్‌లోని మై ప్లాన్స్‌ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలుంటాయని తెలిపింది.  ఈ ఆఫర్‌ జూన్ 1 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ సడలింపు వల్ల తమ ఆఫర్‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని సంస్థ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

చదవండి: చార్జీల వడ్డన: జియోకు భారీ షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top