సౌదీ ఆరామ్‌కో విలువ... రూ.120 లక్షల కోట్లు

Saudi Aramco is worth Rs 120 lakh crore - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ

2,560 కోట్ల డాలర్లతో ‘అలీబాబా’ రికార్డ్‌ బ్రేక్‌

12న సౌదీ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో లిస్టింగ్‌!

రియాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌ విలువ గల కంపెనీగా సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో అవతరించనున్నది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిలిచింది. ఐపీఓలో భాగంగా తన షేర్‌ ధరను 32 రియాల్స్‌(8.53 డాలర్లు–రూ.601)గా  సౌదీ ఆరామ్‌కో నిర్ణయించింది. ఈ ధర పరంగా ఈ కంపెనీ ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) అవుతుంది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అతిపెద్ద ఐపీఓగా ఉన్న అలీబాబా రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌కో బ్రేక్‌ చేసినట్లే. 2014లో చైనా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీ అలీబాబా ఐపీఓ ద్వారా 2,500 కోట్ల డాలర్లు సమీకరించింది. కాగా అదనంగా వచ్చిన దరఖాస్తులను కూడా వినియోగించుకోవాలని (గ్రీన్‌ షూ ఆప్షన్‌) కంపెనీ భావిస్తే, సౌదీ ఆరామ్‌కో ఐపీఓ సైజు 2,940 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా.  

ప్రపంచంలోనే పెద్ద కంపెనీ...!  
మరోవైపు తాజా ఇష్యూ ధరను బట్టి సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లుగా(సుమారు రూ.120 లక్షల కోట్లు) తేలుతుంది. మార్కెట్‌ విలువ పరంగా.. యాపిల్‌(1.2 లక్షల కోట్ల డాలర్లు); మైక్రోసాఫ్ట్, అలీబాబా(1.1 లక్షల కోట్ల డాలర్లు) కంటే ఎంతో ఎగువున సౌదీ ఆరామ్‌కో ఉంది. తాదవుల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో సౌదీ ఆరామ్‌కో షేర్లు ఈ నెల 12న లిస్టయ్యే అవకాశాలున్నాయి. 2020లో 7,500 కోట్ల డాలర్ల డివిడెండ్‌ను ఇవ్వాలని సౌదీ ఆరామ్‌కో భావిస్తోంది. ఇది యాపిల్‌ డివిడెండ్‌ కంటే  ఐదు రెట్లు అధికం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top