ఒక్క గంటలో ఆయన సంపాదన రూ. 16వేల కోట్లు

Tesla Chief Elon Musk Adds 2.3 Billion Dollars To His Fortune In Just 60 Minutes - Sakshi

షేర్‌ మార్కెట్‌ ఓడలను బండ్లను చేస్తుంది.. బండ్లను ఓడలు చేస్తుందన్నది పాతమాట. ఈ మధ్య ట్రెండ్‌ మారింది. దిగ్గజ కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటూ సంపదను పోగు చేసుకుంటున్నాయి. స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు (రూ.16వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగానే ఉంటాయనే అంచనాలు, మోడల్‌ వై క్రాసోవర్‌ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్‌ స్ట్రీట్‌లో ఈ కంపెనీల షేర్లు పరుగులుపెట్టాయి.

టెస్లా సీఈవో స్టెప్పులు, వీడియో వైరల్‌

580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్‌ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద దీంతో 36బిలియన్‌ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్‌ అంచనా కట్టింది. అతనికి టెస్లాలో ఐదోవంతు షేర్లు, స్పేస్‌ ఎక్సోప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌లో 14.6 బిలియన్‌ డాలర్ల షేర్లు ఉన్నాయి. టెస్లా మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లను ఇప్పటికే అధిగమించింది. టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయి. చైనాలో మోడల్‌ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి.

ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌.. 2 నిమిషాల్లో..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top