నాకే ఎందుకిలా..? మాల్యా 

Vijay Mallya Once Again offers 100 percent payback to Indian banks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఫ్యుజిటివ్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మళ్లీ ట్విటర్‌ అందుకున్నారు. బ్యాంకులకు 100 శాతం తిరిగి చెల్లిస్తానంటూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌కోసం తీసుకున్నమొత్తం రుణాన్ని చెల్లించడం కోసం తాను సిద్దంగా ఉన్నా.. బ్యాంకులు ఎందుకు అంగీకరిచడంలేదంటూ మరోసారి వాపోయారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ దుస్థితిపై టీవీల్లో చర్చల్ని చూశాను. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కష్టాలు బాధాకరమని మాల్యా పేర్కొన్నారు. కొన్ని వ్యాపార తప్పిదాల వల్ల కింగ్‌ ఫిషర్‌తోపాటు భారతీయ విమానయాన సంస్థలు కుప్పకూలడం విచారకరం. ఇపుడు అనూహ్యంగా జెట్ పతనం.  100శాతం  రుణాలు చెల్లి‍స్తానని చెబుతున్నా..కానీ సీబీఐ, ఈడీ తనపై క్రిమినల్‌  కేసులు నమోదు చేశారు. నాకే ఎందుకు ఇలా అంటూ మాల్యా అసహనం వ్యక‍్తం చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top