బెల్లంకొండ కళాశాలపై కేసు

Case File Against Bellankonda College on Secret Classes - Sakshi

నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహించిన ఫలితం  

ప్రకాశం, పొదిలి రూరల్‌: పొదిలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్లంకొండ కళాశాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.సురేష్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మరి కారణంగా ఎక్కడా విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పని చేయకూడదని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే పొదిలి మండలంలోని బెల్లంకొండ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామ మహిళా పోలీసు కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. రెండు రోజుల తర్వాత మంగళవారం మళ్లీ తరగతులు యథావిధిగా నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసు అప్రమత్తమై పొదిలి సీఐ శ్రీరామ్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు కళాశాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కళాశాలపై కేసు నమోదు చేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top