స్పా పేరుతో వేశ్యావాటిక

కర్ణాటక, బనశంకరి: మసాజ్ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడిచేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు మంది యువతులను కాపాడారు. కోరమంగల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో స్పా మసాజ్ హ్యాపీ వెడ్డింగ్ అనే మసాజ్ పార్లర్లో వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో దాడిచేసి ఇన్వెంట్ క్రిస్టి సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదుమంది యువతులను కాపాడారు. సులభంగా డబ్బు సంపాదించే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బయటి రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించుకుని వారితో పడుపువృత్తి చేస్తున్నాడని విచారణలో తేలింది. రాజేశ్, మోసిస్ట్ అనే ఇద్దరి సూత్రధారులు పరారీలో ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి