కూతురిని చంపి గంగలో పడేశారు!

couple killed Daughter And  After Dumped In Ganga River - Sakshi

సాక్షి, పశ్చిమ బెంగాల్‌: పరువు కోసం​ కన్న కూతురిని చంపిన కిరాతక తల్లిదండ్రులను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 16 ఏళ్ల కుతురి  ప్రేమ వ్యవహారం తెలియడంతో సొంత తల్లిదండ్రులే పరువు పోతుందని ఈ దారుణానికి ఒడిగట్టారు.  తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక, పొరుగూరికి చెందిన అచింత్య మొండల్ అనే యువకుడిని ప్రేమించింది. దీంతో కుతురి ప్రేమ విషయం తెలిసి ఆమెను తల్లిదండ్రులు వారించారు. అతనితో కలిసి తిరగవద్దని హెచ్చరించారు. అయినా వారు మాట వినకపోవడంతో తల్లిదండ్రులు ఈ మేరకు పరువు హత్యకు ఒడిగట్టారు. కూతురిని చంపి మృతదేహాన్ని బ్యాగ్‌లో కుక్కి గంగానదిలో పడేశారని పోలీసులు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు సూపరిండెంట్‌ ఇఫ్‌ పోలీస్‌ అలోక్ రాజోరియా పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top