తండ్రి ఘాతుకం

Father Assassinated Six Months Baby in Prakasam - Sakshi

ఆరు నెలల పసికందును గొంతు నులిమి హత్య 

మతిస్థిమితం లేకే చంపాడంటున్న బంధువులు

యర్రగొండపాలెం:కుటుంబ సభ్యులు తన చిల్లర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని 6 నెలల ఆడశిశువును కన్న తండ్రి గొంతుపట్టుకొని విసిరి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని అమానిగుడిపాడు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వైదన బాల ఏసు బీడీల కోసం భార్య విజయులును డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బుల్లేవని చెప్పిన వెంటనే కిందపడుకొని ఉన్న పసికందు గొంతుపట్టుకొని విసిరేశాడు. ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. బాలఏసుకు మతిస్థిమితం లేదని, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థంకాని పరిస్థితని ఆయన బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.ముక్కంటి తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top