ఇంద్రవెల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

Husband And Wife Killwd In Road Accident In Adilabad - Sakshi

ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టిన కారు

100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన వైనం

ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

పరారీలో నిందితుడు

సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్‌) : ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జీవనోపాధికై ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను వేగంగా ఢీకొట్టిన కారు మృత్యువు రూపంలో కబలించింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అరికిల్ల గంగారం, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటురు జిల్లా పిడుగురాళ్ల మండలానికి చెందిన ఏమోలోల అంజి(40), లక్ష్మీ(30) దంపతులు గత 10 సంవత్సరాలుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వివిధ గ్రామాల్లో తిరుగుతూ బుగ్గలు, ఇంటి సామగ్రి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.

జీవనోపాధిలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌ నుంచి ఉట్నూర్‌ వైపు భార్యాభర్తలు తమ ఎక్సల్‌ ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఇంద్రవెల్లి మండల కేంద్రానికి కొద్ది దూరంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో అతి వేగంగా ఎదురుగా వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. సుమారు 100 మీటర్ల దూరం వరకు కారు ద్విచక్రవాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో భార్యభర్తలు ఇద్దరు త్రీవగాయలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై అరికిల్ల గంగారం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 

పెద్ద దిక్కు కోల్పోయిన పిల్లలు
ఆదిలాబాద్‌రూరల్‌: లక్ష్మి, అంజిబాబుల మరణంతో వారి ఇద్దరు కుమారులు,  కూతురు అనాథలయ్యారు. ప్రస్తుతం వారివురూ గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top