ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

మంచిర్యాల, కాగజ్‌నగర్‌రూరల్: ప్రేమించుకున్నాక పెద్దలు ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకున్న సంఘట నలు విన్నాం కానీ పెళ్లయి, ఒక అబ్బాయి కలిగాక పెళ్లి కానీ అమ్మాయితో అక్రమ ప్రేమ వ్యవహారం కొనసాగించి ఆఖరుకు ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సంఘటన మండలంలోని అంకుశాపూర్ గ్రామ పొలిమేరలో ఉగాది రోజున చోటు చేసుకుంది. కాగజ్‌నగ ర్ రూరల్ ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం..
దహేగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన సంతోష్ (35), కాగజ్‌నగర్ మండలం కొత్తసార్సాల గ్రామానికి చెందిన యువతి డోకే శైలజ (20)లు బుధవారం తెల్ల వారుజామున అంకుశాపూర్ గ్రామం సమీపంలో రిజర్వు ఫారెస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన జ్యోతితో సంతోష్‌కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా వారికి 5సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కానీ ఇటీవల కాగజ్‌నగర్ మండలం సార్సాల గ్రామానికి చెందిన శైలజతో సంతోష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి