అత్యాచారం చేసి, బ‌తికుండ‌గానే నిప్పు పెట్టి..

Man Sets Fire To Minor Boy After Commit Heinous Crimes In Uttar Pradesh - Sakshi

ల‌క్నో: ఓ వ్య‌క్తి మైన‌ర్ బాలుడిపై అస‌హ‌జ‌ అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మే కాక బ‌తికుండ‌గానే కాల్చివేయ‌డానికి ప్ర‌య‌త్నించిన ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యూపీలోని ప్ర‌యాగ‌రాలో స‌ల్మాన్ అనే యువ‌‌కుడు బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఓ మైన‌ర్ బాలుడిని ఆడుకుందామ‌ని పిలిచాడు. దీంతో అత‌న్ని న‌మ్మి వెళ్లిన ప‌దేళ్ల బాలుడిని నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో భ‌య‌ప‌డిపోయిన బాలుడు ర‌క్షించండంటూ సాయం కోసం కేక‌లు వేస్తూ ఏడ్చాడు. (భార్యకు కరోనా పాజిటివ్‌.. భర్త ఆత్మహత్య)

దీంతో ఆగ్ర‌హం చెందిన‌ నిందితుడు బాలుడి గొంతు నులుముతూ హ‌త్యాచారానికి ప్ర‌య‌త్నించ‌గా అతను అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయాడు. చ‌నిపోయాడ‌ని భావించిన నిందితుడు అత‌డిని త‌గుల‌బెట్టాల‌ని భావించాడు. వెంటనే పిల్ల‌వాడిని స‌మీపంలోని పొద‌లోకి లాక్కెళ్లి అత‌డి శ‌రీరానికి నిప్పంటించి అక్క‌డి నుంచి పారిపోయాడు. స్పృహ‌లోకి వ‌చ్చిన మైన‌ర్ బాలుడు సాయం కోసం అరవ‌డంతో గ‌మ‌నించిన‌ స్థానికులు మంట‌ల‌ను ఆర్పివేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. (ఎదిగి వస్తున్నారనుకున్న పిల్లలు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top