ప్రాణం తీసిన త్రిబుల్ రైడింగ్

డివైడర్‌ను ఢీకొన్న బైక్
ఇద్దరి దుర్మరణం మరొకరికి గాయాలు
మృతులిద్దరూ మైనర్లు
చోరీకి గురైన వాహనంగా గుర్తింపు
ఖైరతాబాద్: బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు మైనర్లు డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పదోతరగతి విద్యార్థి గోపాల్(15), ప్రైవేట్ షాపులో పనిచేసే షోహెబ్(15), బిట్లు (15) గురువారం రాత్రి హోండాపై భోజనం చేసేందుకు నాంపల్లికి వచ్చారు. అర్థరాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి తిరిగి వెళుతుండగా ఖైరతాబాద్ చౌరస్తా సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వీరి వాహనం డివైడర్‌ను ఢీ కొనడంతో వాహనం నడుపుతున్న గోపాల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మధ్యలో కూర్చున్న షోహెబ్, బిట్టులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోహెబ్ మృతిచెందాడు. బిట్టు చికిత్స పొందుతున్నాడు. బైక్ అతివేగంగా ఉన్నందునే అదుపు తప్పి ప్రమాదం జరిగిందా, ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారా అన్నదానిపై పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వాహనానికి ముందు, వెనుక నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు ఆరా తీయగా హోండా యాక్టీవా 5జీ చోరీకి గురైందని ఈ మేరకు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో వాహనయజమాని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి