ప్రకాశం జిల్లాలో బాలికపై లైంగిక దాడి 

Molestation On Girl In Prakasam District - Sakshi

మర్లపాలెం (కురిచేడు): సభ్య సమాజం తలదించుకునేలా.. మానవతా విలువలు మంటగలిసేలా ఓ కామాంధుడు కుమార్తె వరసైన తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మర్లపాలెంలో శుక్రవారం జరిగింది. ఒక వైపు చట్టాలు కఠినతరం చేస్తూ శిక్షలు బహిరంగంగా వేస్తున్నా ఇలాంటి మానవ మృగాలతో సమాజంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మునగాల సుబ్బారెడ్డి వికలాంగుడు. మధ్యాహ్నం వేళ ఓ చిన్నారి తన ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న తరుణంలో సుబ్బారెడ్డి ఆమెకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపాడు.

బాలిక అతడి మాటలు నమ్మి సుబ్బారెడ్డి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన అతడు మానవత్వం కోల్పోయి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చారు. బాలిక తీవ్ర రక్తస్రావంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డీఎస్సీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మొహ్మద్‌ మోయిన్‌లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడు ఇంట్లోనే చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడి భార్య పొలం పనులకు వెళ్లింది. నిందితుడు నిత్యం తన బంకు వద్దకు తినుబండారాలు కొనేందుకు వచ్చే చిన్నారులను లైంగికంగా వేధిస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కొందరు చిన్నారులతో  అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా మానవ మృగాలకు వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top