కరోనా: ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై హైదరాబాద్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వనస్థలిపురంలోని జీవన్ సాయి హాస్పిటల్ వారు 6 రోజుల పాటు వైద్యం అందించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి మలక్‌పేటకు చెందిన గ్రౌండ్‌నట్ షాప్ యాజమానిగా పోలీసులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తితో సంబంధం ఉన్న మరో 16 మందిని పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి