ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం తిరువూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఓ కారు.. మినీ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మెడికో విద్యార్థులుగా గుర్తించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి