దెయ్యం విడిపిస్తానని లైంగికదాడి

కర్ణాటక,మైసూరు: దెయ్యం విడిపిస్తానని చెప్పి యువతిపై ఒక ధర్మ గురువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలో జరిగింది. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆమెకు దయ్యం పట్టిందని భావించిన బంధువు... హణసూరు లాల్బన్ వీధికి చెందిన ధర్మగురువు జబీవుల్లా వద్దకు తీసుకొచ్చాడు. ఆమెపై మంత్ర ప్రయోగం జరిగిందని, దయ్యం పట్టుకుందని పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని విడిపిస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
దీంతో బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు. యువతి వద్ద ఉంటే నీకూ దెయ్యం పడుతుందని బంధువును దూరంగా పంపించాడు. అనంతరం యువతికి స్నానం చేయాలనే నెపంతో తీసుకెళ్లి జబీవుల్లా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ పైశాచిక కృత్యంతో బెదిరిపోయిన యువతి జరిగిన సంగతిని తన తండ్రికి తెలిపింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి జబీవుల్లాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి