దొంగతనానికి వెళ్లి యువతి పక్కన నగ్నంగా...

Teen Sleeps Naked Alongside College Girl After Burglary In USA - Sakshi

కాలిఫోర్నియా : అమెరికాలో ఓ దొంగ వింతగా ప్రవర్తించి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన యువకుడు.. అదే ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కగా నగ్నంగా నిద్రపోయాడు. ఈ వింత ఘటన నార్త్‌ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగను అరెస్ట్‌ చేశారు. వివరాలు.. చికో స్టేట్‌ యూనివర్సీటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని నార్త్‌ కాలిఫోర్నియలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఈ నెల 9న అర్థరాత్రి ఓ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు.  

అనంతరం బెడ్‌రూంలోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన యువతి నగ్నంగా ఉన్న యువకుడిని చూసి గట్టిగా అరిచింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చికో పోలీసులు విచారణ చేపట్టి యువకున్ని అరెస్ట్‌ చేశారు. సీసీ కెమెరాల ద్వారా యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని, కానీ నగ్నంగా ఎందుకు నిద్రపోయాడో ఇంతవరకూ తెలపడం లేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top