ఆర్టీసీ సమ్మె : బస్సు దూసుకెళ్లడంతో..

సాక్షి, ములుగు : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జేఏసీ నాయకులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆర్టీసీ బస్సును ప్రైవేటు డ్రైవర్ నడిపిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందారావుపేట మండలం పసర గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వడ్డే జ్యోతి (29) అనే మహిళ పై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. జ్యోతి పసర గ్రామంలోని ఒక హోటల్‌లో దినసరి కూలీగా పనిచేస్తోంది. ఆమె స్వగ్రామం ఏటూరునాగారం మండలం రొయ్యూరు అని తెలిసింది. కాగా, నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకుచేరింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి