ప్రియురాలిని హత్య చేసి.. పాతిపెట్టి.. 

Woman Brutally Murdered Boyfriend At Anna Nagar Chennai - Sakshi

అన్నానగర్‌: నెల్లైలో ప్రియురాలిని చంపి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నెల్లై పట్టణం సెబస్టియార్‌ ఆలయ వీధికి చెందిన మణికంఠన్‌ (20), రామయన్‌పట్టికి చెందిన ఆసీర్‌ సెల్వం (32)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. సేరన్‌మాదేవి సమీపంలో ఉన్న శక్తికులమ్‌కి చెందిన శివకుమార్‌ (36)కు కోవైకి చెందిన ఓ మహిళకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 2012 నుంచి నెల్లైలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య కొన్నేళ్ల కిత్రం వివాదాలు రావడంతో శివకుమార్‌ ఆమెను హత్య చేశాడు. 

అనంతరం మణికంఠన్, అసీర్‌ సెల్లం సాయంతో మృతదేహాన్ని పాతిపెట్టారు. అనంతరం శివకుమార్‌ ముంబై వెళ్లి అక్కడ జీవిస్తున్నాడు. అయితే ఈ హత్య గురించి పోలీసులకు రహస్య సమాచారం అందడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ స్థితిలో శివ గురువారం సొంత ఊరికి వచ్చాడు. అతనిని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. ఇందులో నెల్‌లై ప్రాంతానికి చెందిన పుష్ప (25)ను, వివాహేతర సమస్యలో హత్య చేసినట్లు అంగీకరించాడు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో తవ్వకాలు జరుపగా పుష్పా ఎముకలు దొరికాయి. వాటిని వైద్య బృందం సేకరించి పరిశోధనకి పంపించారు. అనంతరం శివని అరెస్టు చేశారు. అతడికి సాయపడిన త్యాగం అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top