తెల్ల చర్మం... నల్ల మచ్చలు..

Another Incident Happened Like George Floyd In New York - Sakshi

తెలుపును శాంతికి చిహ్నంగా భావిస్తాం. అయితే చాలాకాలంగా ‘మేం తెల్లవాళ్లం, మీరు నల్లవాళ్లు’ అనే జాత్యహంకారం అందుకు పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. వ్యక్తుల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. ఇటీవలే అమెరికాలో ఒక పోలీసు నల్ల జాతీయుడైన ఫ్లాయిడ్‌ని మోకాలితో మెడ మీద నొక్కి ఊపిరాడకుండా చేసిన వీడియో ఎంతటి కల్లోలాన్ని సృష్టిస్తోందో చూస్తున్నాం. ఇప్పుడు అటువంటిదే మరో సంఘటన న్యూయార్క్‌లో జరిగింది.

అది న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌...
సెంట్రల్‌ పార్క్‌కి చాలామంది వాకింగ్‌ చేయటానికి వస్తుంటారు. ఈ పార్కు 843 ఎకరాల విస్లీర్ణంలో ఉంది. ఈ పార్కుని ఏడాదికి 38 మిలియన్ల మంది వీ„ì స్తుంటారు. సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. 1858లో ఈ పార్కు ఓపెన్‌ అయ్యింది. అంతటి చరిత్ర ఉన్న పార్కుకి ఎవరెవరో రావటం, వారికి కావలసిన సుందర దృశ్యాలను ఆనందించటమో, కెమెరాలో బంధించటమో, సినిమా తీయటమో జరుగుతూనే ఉంటాయి. ఆ పార్కుకి వారం రోజుల క్రితం అమీ కూపర్‌ అనే తెల్లజాతి మహిళ తన డాల్మేషియన్‌ డాగ్‌ను తీసుకుని వచ్చింది. ఎక్కువమంది తిరిగే ప్రదేశాలకు వచ్చినప్పుడు, కుక్కకు బెల్టు పెట్టి, ఎక్కడకూ పరుగులు తీయకుండా చూడవలసిన బాధ్యత యజమానిదే. ఇందుకు విరుద్ధంగా అమీ కూపర్‌ కుక్క మెడకు తగిలించవలసిన పొడవాటి తాడును తన చేత్తో పట్టుకుని, కుక్క మెడకు ఉన్న బెల్టును ఒడిసి పట్టుకుంది. అది తప్పించుకు పోవటానికి తెగ ప్రయత్నిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో తన  వీడియో కెమెరాలో పక్షులను బంధిస్తున్న క్రిస్టియన్‌ కూపర్‌ (వీరిద్దరికీ సంబంధం లేదు) అనే ఒక నల్లజాతీయుడు తనను, తన కుక్కను వీడియో తీస్తున్నాడని ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. అది రూఢి చేసుకోకుండానే, ‘‘నువ్వు నన్ను వీడియో తీస్తున్నావు, నా కుక్కను బెదిరిస్తున్నావు...’’ అంటూ గట్టిగా అరుపులు ప్రారంభించింది. ‘పోలీసులను పిలుచుకో’ అన్నాడు క్రిస్టియన్‌ కూపర్‌. వెంటనే పోలీసులకి ఫోన్‌ చేసి, భయంతో అరుస్తూ, ఒక నల్ల జాతీయుడు తనను బెదిరిస్తున్నాడని, అతని బారినుంచి తనను కాపాడమని చెప్పింది. దాంతో అప్పటిదాకా పక్షులను వీడియో తీస్తున్న నల్ల జాతీయుడు ఆమె చేష్టలను వీడియోలో బంధించాడు.

‘నేను వీడియో తీయకపోతే, పోలీసులు వచ్చినప్పుడు వారికి చూపటానికి నా దగ్గర సాక్ష్యాలు ఉండవు కదా’ అంటున్నారు క్రిస్టియన్‌ కూపర్‌. పోలీసులు వచ్చి విషయం అడిగారు. తనను చిత్రీకరిస్తున్నాడని, తన కుక్కను బెదిరిస్తున్నాడనీ చెప్పింది అమీ. తాను పక్షులను చూస్తున్నాననీ, తనను నల్లజాతీయుడు అనటం తన మనసును గాయపరచిందన్నాడు కూపర్‌. వీడియో చూసిన పోలీసు, అమీదే తప్పని తేల్చాడు. సారీ చెప్పమన్నాడు. అమీ బహిరంగంగా అందరి ముందు పలుసార్లు సారీ చెప్పింది. అమె ఎన్నిసార్లు సారీలు చెప్పినా అతడి మనసు కుదుటపడినట్లు అనిపించడం లేదు. ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top