డిస్నీ బ్యూటీ

There sHould be Enough jewelery To Make The Sarees Look More Beautiful - Sakshi

ఫ్యాషన్‌

మిక్కీమౌజ్, డోరెమాన్,టామ్‌ అండ్‌ జెర్రీ..డిస్నీ వరల్డ్‌ అంటేపిల్లలకు చెప్పలేనంత ఇష్టం.ఆ బొమ్మలున్న డ్రెస్సులు కూడాఅంతే ప్రత్యేకతను చూపుతున్నాయి.టీవీ కార్టూన్‌ షోలలో కనిపించే ఈ బొమ్మలకు ఓఅరుదైన గుర్తింపు కలిపిస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.కామిక్‌ బొమ్మల ప్రింట్లున్న చీరలుఅమ్మలే కాదు అమ్మాయిలూఇష్టపడి ఎంచుకుంటున్నారు.పార్టీలో ప్రత్యేకతనుచాటుతున్నారు.

పువ్వుల రింగులు
వేడుక ఏదైనా డ్రెస్‌ సెలక్షన్‌ తర్వాత ఆభరణాలు సింగారం మీదనే దృష్టి పెడతారు అతివలు. గ్రాండ్‌గా కనులకువిందు చేసే ఆభరణాల కోసం ఎంతమొత్తమైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ప్రస్తుత కాలం వేరు. పార్టీకి తగ్గట్టు డ్రెస్‌ ఉండాలి. ఆ డ్రెస్‌ మరింత అందంగా కనిపించడానికి తగిన ఆభరణాలు ఉండాలి. అందుకు ఈ పువ్వుల డిజైన్లు ఉన్న రింగులు ప్రత్యేక సింగారాన్ని తీసుకువస్తున్నాయి. సింపుల్‌గానూ, గ్రేస్‌గా ఉండే ఈ పువ్వుల డిజైన్‌ రింగులు సిల్వర్, స్టీల్‌ మెటల్‌తో తయరుచేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వందరూపాయల నుంచి లభించే ఈ డిజైనర్‌ రింగ్స్‌తో వేడుకలో మరింత ఆహ్లాదంగా, బ్యూటిఫుల్‌గా వెలిగిపోవచ్చు.

ఇండియన్‌ డిజైనర్‌ సత్యపౌల్‌ సిల్క్‌ పై చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సిల్క్, షిఫాన్, క్రేప్‌ చీరల మీద కామిక్‌ డిజైన్స్‌ను ప్రింట్లుగా వేసి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఆ డిజైన్స్‌ను పోలిన కామిక్‌ వరల్డ్‌ ప్రింటెడ్‌ శారీస్‌ గెట్‌ టు గెదర్‌ పార్టీలో ప్రత్యేకతను చాటుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top