వారఫలాలు (జూలై 19 నుంచి జూలై 25 వరకు)

Weekly Horoscope From July 19th To July 25th 2020 - Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు  ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి ఏర్పడి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం మధ్యలో  కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యుని పూజించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇతరులనుంచి రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో  నిదానం అవసరం. లాభాలు స్వల్పంగా ఉంటాయి.  ఉద్యోగాలలో పనిభారం మరింత పెరిగి సతమతమవుతారు. కళారంగం వారికి కాస్త నిరాశ తప్పదు. వారం మధ్యలో  శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత చికాకులు . రావలసిన సొమ్ము అందుతుంది. బాకీలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని  ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని పదవులు దక్కించుకుంటారు. వారం చివరిలో  ధననష్టం. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు  చేస్తారు. వాహనాలు , భూములు కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగార్థుల యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో  దుబారా ఖర్చులు. బంధువులతో తగాదాలు. పసుపు, బంగారు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సత్యనారాయణస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు అనుకున్న విధంగా సాగుతాయి. అంచనాలు నిజం కాగలవు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కుటుంబంలో కొన్ని  శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  ఆకస్మిక ధనలాభం. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో  పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న çవిధంగా  పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.  నిరుద్యోగుల కల ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అయితే కొంత భారం తప్పదు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం మధ్యలో కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇతరులకు కూడా సహాయపడతారు. కాంట్రాక్టులు అనూహ్యంగా  పొందుతారు. వాహనాలు,  భూములు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో  కొత్త బాధ్యతలు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యజయం. బంధువర్గం నుంచి శుభవర్తమానాలు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.  స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబా«ధల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహయత్నాలు సానుకూలమవుతాయి.  వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగంవారికి కొన్ని  అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు.  భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అప్పులు సైతం తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో కొన్ని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల వారు.పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. చేతినిండా సొమ్ము ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు.  ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారం చివరలో  ధనవ్యయం. మిత్రులతో స్వల్వ వివాదాలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ పూజలు చేయండి. 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కే సమయం. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. వాహనయోగం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు  నిదానంగా పూర్తి కాగలవు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దాతృత్వాన్ని చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. బాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికరంగం వారి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 
-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top